Sri Lakshmi: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తీసుకువచ్చిన ఫైల్ పై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి నారాయణ

Minister Narayana rejected sign a file brought by IAS Official Sri Lakshmi

  • ఏపీలో కొలువుదీరిన కొత్తప్రభుత్వం
  • నేడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ
  • శ్రీలక్ష్మి తీసుకువచ్చిన ఫైల్ ను తిప్పి పంపిన వైనం

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రస్తుతం రాష్ట్ర అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ నేడు బాధ్యతలు చేపట్టారు. 

ఈ సందర్భంగా శ్రీలక్ష్మి ఓ ఫైల్ తీసుకుని మంత్రి నారాయణ చాంబర్ కు వెళ్లారు. అయితే, మంత్రి నారాయణ ఆ ఫైల్ పై సంతకం చేసేందుకు నిరాకరించారు. దాంతో, శ్రీలక్ష్మి ఆ ఫైల్ ను తిరిగి తీసుకెళ్లారు. 

ఇటీవల కూడా సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు శ్రీలక్ష్మి బొకే తీసుకుని వచ్చారు. అయితే, ఆ బొకే మీరే ఉంచుకోండి అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం ఓ వీడియోలో  కనిపించింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వైఎస్ కుటుంబానికి సన్నిహితురాలిగా ముద్రపడ్డారు. ఆమె గతంలో జైలుకు కూడా వెళ్లారు.

Sri Lakshmi
IAS
Naranayana
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News