KTR: కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

neither is there any Law nor any Order now in congress government
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేదన్న కేటీఆర్
  • కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి మత హింస జరగలేదని ప్రస్థావన
  • ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గత తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి మతహింస జరగలేదని, తెలంగాణ శాంతియుతంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లా, ఆర్డర్ రెండూ లేవని విమర్శించారు. గతంలో ఎప్పుడూ మతపరమైన కార్యకలాపాలు జరగని, ప్రశాంతమైన మెదక్ పట్టణంలో హింస చెలరేగడం నిజంగా సిగ్గుచేటు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మెదక్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని, మెదక్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారంటూ ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మెదక్‌లో హింసకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
KTR
BRS
Congress
Telangana
TS Politics

More Telugu News