Chandrababu: మహిళా కార్యకర్త అందించిన సన్ గ్లాసులు ధరించిన చంద్రబాబు... వీడియో వైరల్

Chandrababu wore sun glasses given by a party worker

  • ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా టీడీపీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు
  • కార్యకర్తలను, వివిధ వర్గాల ప్రజలను కలిసిన ముఖ్యమంత్రి
  • ఓ మహిళా కార్యకర్తకు ఆనందం కలిగించిన చంద్రబాబు

ఇవాళ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు పార్టీ  కార్యకర్తలను, వివిధ వర్గాల ప్రజలను కలిశారు. అందరితో ఓపిగ్గా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ క్రమంలో ఓ మహిళా కార్యకర్త చంద్రబాబుకు సన్ గ్లాసులు ఇచ్చి, వాటిని పెట్టుకోవాలని కోరింది. ఆమె కోరికను మన్నించిన చంద్రబాబు ఆ కూలింగ్ గ్లాసులు ధరించారు. 

దాంతో ఆ మహిళా కార్యకర్త పట్టరాని సంతోషంతో పొంగిపోయింది. గాల్లోకి పిడికిలి విసురుతూ నినాదాలు చేసింది. ఫొటోలకు పోజులిచ్చిన అనంతరం, చంద్రబాబు ఆ కళ్లద్దాలు తీసి ఆమెకు ఇచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News