Uma Harathi: ట్రైనీ ఐఏఎస్ గా వచ్చిన కుమార్తె ఉమాహారతికి సెల్యూట్ చేసిన పోలీసు ఉన్నతాధికారి వెంకటేశ్వర్లు

SP Rank officer Venkateswarlu salutes his trainee IAS daughter Uma Harathi at Telangana Police Academy
  • 2022 సివిల్స్ లో మూడో ర్యాంకు సాధించిన ఉమాహారతి
  • ట్రైనీ ఐఏఎస్ గా తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చిన ఉమాహారతి
  • కుమార్తెను చూసి గర్వంతో ఉప్పొంగిపోయిన ఎస్పీ ర్యాంక్ అధికారి వెంకటేశ్వర్లు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన నూకల ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం తెలిసిందే. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్నారు. 

తాజాగా, ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్ గా తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చారు. అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు గర్వించారు. హృదయం ఉప్పొంగిపోగా, ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేశారు. కుమార్తెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Uma Harathi
IAS
SP Venkateswarlu
Police
Telangana

More Telugu News