Telangana: తెలంగాణలో 20 మంది ఐఏఎస్‌ల‌ బ‌దిలీ

Telangana Government Transfered Several IAS Officers Some Collectors Also Transfered
  • 20 మంది అధికారుల‌కు స్థాన‌చ‌ల‌నం క‌లిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్త‌ర్వులు
  • ట్రాన్స్‌కో జేఎండీ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా బ‌దిలీ
  • నాగ‌ర్ క‌ర్నూల్ క‌లెక్ట‌ర్‌గా బ‌దావ‌త్ సంతోశ్‌
  • భ‌ద్రాద్రి క‌లెక్టర్‌గా జితేశ్ వి పాటిల్
తెలంగాణ ప్ర‌భుత్వం భారీగా ఐఏఎస్‌ల‌ బ‌దిలీల‌ను చేపట్టింది. 20 మంది అధికారుల‌కు స్థాన‌చ‌ల‌నం క‌లిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. మొత్తం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. పెద్ద‌ప‌ల్లి క‌లెక్ట‌ర్‌గా కోయ శ్రీహ‌ర్ష‌, నాగ‌ర్ క‌ర్నూల్ క‌లెక్ట‌ర్‌గా బ‌దావ‌త్ సంతోశ్‌, ట్రాన్స్‌కో జేఎండీ సందీప్ కుమార్ ఝాను సిరిల్ల క‌లెక్టర్‌గా నియమించారు. క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్‌గా అనురాగ్ జ‌యంతి, భ‌ద్రాద్రి క‌లెక్టర్‌గా జితేశ్ వి పాటిల్, నిర్మల్‌ కలెక్టర్‌ ఆశీష్‌ సంగ్వాన్‌ కామారెడ్డిజిల్లా కలెక్టర్‌గా నియ‌మితుల‌య్యారు.   

అలాగే రాహుల్ శర్మను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా, పి.ప్రావీణ్యను వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ పదవి నుంచి హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా, హన్మకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా, సత్యప్రసాద్‌ను ఖమ్మం అదనపు కలెక్టర్‌ పదవి నుంచి జగిత్యాల కలెక్టర్‌గా బదిలీ చేశారు.

ఇక విజయేంద్ర బోయిని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా, సత్య శారదాదేవిని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, ప్రతీక్ జైన్‌ను వికారాబాద్‌ కలెక్టర్‌గా, నారాయణరెడ్డిని నల్గొండ జిల్లా కలెక్టర్ గా, కుమార్‌ దీపక్‌ను మంచిర్యాల కలెక్టర్‌గా, ఆదర్శ సురభిని వనపర్తి జిల్లా కలెక్టర్‌గా, దివాకర్‌ను ములుగు జిల్లా కలెక్టర్‌గా, అభిలాష అభినవ్‌ను నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌గా, తేజస్‌ నంద్‌లాల్‌ను సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Telangana
IAS Officers
Collectors
Transfered

More Telugu News