టీటీడీ కొత్త ఈవోగా శ్యామలరావు నియామకం
- ఏపీలో కొత్త ప్రభుత్వం
- టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి తొలగింపు
- సెలవుపై వెళ్లిన ధర్మారెడ్డి
- టీటీడీ నూతన ఈవోగా జె.శ్యామలరావు... ఉత్తర్వులు జారీ
ఇప్పటికే, టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తొలగించారు. ఆయన స్థానంలో టీటీడీ కొత్త ఈవోగా జె.శ్యామలరావును నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, తొలగింపునకు గురైన ధర్మారెడ్డి సెలవుపై వెళ్లారు.
శ్యామలరావు ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన గతంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు.