Ch Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

Police files case agains Mallareddy
  • మల్లారెడ్డితో పాటు అల్లుడు రాజశేఖరరెడ్డిపై కేసు నమోదు
  • 32 గుంటల స్థలం కబ్జా చేశారని శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు
  • తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారని ఆరోపణలు
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదయింది. భూకబ్జా కేసులో పేట్‌బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డిపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకు చెందిన 32 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని శేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చివేయించారని ఆరోపించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు సుచిత్రలోని భూమిని కబ్జా చేసినట్లు నిర్ధారించారు.
Ch Malla Reddy
BRS
Congress

More Telugu News