Telangana: పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు

School text books should be taken back
  • ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
  • ముందుమాట మార్చకుండా ముద్రించిన విద్యాశాఖ
  • ముందుమాట మార్చకుండా ముద్రించడంతో వివాదాస్పదం
తెలంగాణలో పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ పంపిణీ చేశారు. అయితే విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదమైంది. దీంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
Telangana
Schools
Books

More Telugu News