YS Jagan: త్వరలో రాష్ట్ర పర్యటన.. మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం!

YS Jagan Sensational Decision
  • మళ్లీ జనంలోకి జగన్‌
  • రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని పార్టీ నేతలకు సమాచారం
  • పోలింగ్, కౌంటింగ్ తర్వాత జరిగిన దాడుల్లో గాయపడిన కార్యకర్తలకు పరామర్శ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో డీలా పడ్డ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మళ్లీ జనంలోకి వెళ్లాలని జగన్‌ నిర్ణయం తీసుకున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్, కౌంటింగ్ తర్వాత జరిగిన దాడుల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శిస్తారట. ఈ నేపథ్యంలో రోజూ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా కమిటీలు వేసినట్లు సమాచారం.
YS Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News