Balakrishna: మెగాస్టార్ చిరంజీవికి స్వాగతం పలికిన బాలయ్య

Nandamuri Balakrishna Invites Megastar Chiranjeevi on Stage
  • చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ 
  • వేదికపైకి చిరంజీవికి స్వాగతం పలికిన బాలయ్య
  • ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్
చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న కేసరపల్లి ఐటీ పార్కు వద్దకు మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఆయనకు నందమూరి బాలకృష్ణ వేదికపైకి స్వాగతం పలికారు. చిరుకు బాలయ్య స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, జనసేన చీఫ్, ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఇక మెగా కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో ఇప్పటికే వేదిక వద్దకు చేరుకుంది. పవన్ కు రాష్ట్ర ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవి లభించడంతో మెగా కుటుంబంలో ఆనందం అంబరాన్నంటుతోంది. రాంచరణ్, నాగబాబు, సురేఖ, సాయిదుర్గాతేజ్, నిహారిక, శ్రీజ, అకీరా, ఆద్య తదితరులు వేదిక వద్దకు చేరుకున్నారు.
Balakrishna
Chiranjeevi
Chandrababu
Andhra Pradesh

More Telugu News