Health: శనగ పిండితో చక్కటి చర్మ ఆరోగ్యం.. ఆశ్చర్యపరిచే ప్రయోజనాలు ఇవే!

Skin health is strong with chickpea flour is good for skin health and gives good benefits for Health
  • పూర్వీకుల కాలం నుంచి వినియోగంలో శనగ పిండి
  • చర్మంపై నిర్జీవ కణాల తొలగింపుకు తోడ్పాటు
  • చర్మ సంరక్షణలో ఎన్నో ప్రయోజనాలు అందిస్తున్న శనగ పిండి
చర్మ సంరక్షణలో శనగ పిండికి ప్రత్యేక స్థానం. చర్మ సంరక్షణ, సౌందర్యం కోసం నేడు అనేక ఉత్పత్తులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. కానీ ప్రాచీన కాలంలో శనగ పిండినే ఎక్కువగా ఉపయోగించేవారు. చర్మంపై పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి అధికంగా వాడేవారు. అంతేకాదు సున్ని పిండితో పాటు శనగ పిండిని కూడా తల స్నానానికి వాడేవారు.

శనగ పిండి చర్మంపై నిర్జీవ కణాలను తొలగించడంలో సహాయ పడుతుంది. చర్మ రంధ్రాల లోతుల్లో పేరుకు పోయిన మురికిని శుభ్రం చేయగల సామర్థ్యం ఈ పిండికి ఉంది. అందుకే ప్రతి రోజూ శనగ పిండిని ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని పూర్వీకుల నుంచి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక శనగ పిండిని నిమ్మ రసం, కీరదోస రసం మిశ్రమాలతో ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతటి విలువైన శనగ పిండి ప్రయోజనాలను వీడియో ద్వారా ‘ఏపీ7ఏఎం’ మీకు అందిస్తోంది. పూర్తిగా చూసేయండి మరి..
Health
Health Tips
Skin health
Chickpea Powder

More Telugu News