Chandrababu: జగన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించిన చంద్రబాబు

Chandrababu trying to invited YS Jagan
  • ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత ప్రయత్నం
  • చంద్రబాబు ఫోన్ కాల్‌కు అందుబాటులోకి రాని జగన్
  • రేపు ఉదయం ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి జగన్‌ను ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నించగా... ఆయన అందుబాటులోకి రాలేదు. రేపు ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు హాజరవుతున్నారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను కూడా తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు చంద్రబాబు మంగళవారం సాయంత్రం ప్రయత్నించారు. వైసీపీ అధినేతతో చంద్రబాబు ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఫోన్ కాల్‌కు జగన్ అందుబాటులోకి రానట్టుగా తెలుస్తోంది.
Chandrababu
YS Jagan
Andhra Pradesh
Telugudesam

More Telugu News