Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ప్రముఖులు... 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

Tight security for Chandrababu taking oath ceremony
  • రేపు ఉదయం కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద సీఎంగా చంద్రబాబు ప్రమాణం
  • మోదీ, అమిత్ షా సహా హాజరవుతున్న వీవీఐపీలు
  • ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు
  • విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు
  • పాస్‌లు ఉన్నవారి వాహనాలకే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతి
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 7 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నడ్డా, బండి సంజయ్, మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి వీవీఐపీలు వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. పాస్‌లు ఉన్న వారి వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతించనున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో ప్రముఖులు బస చేసే హోటళ్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రామకృష్ణ తెలిపారు. అమిత్ షా, బండి సంజయ్ తదితరులు ఈరోజు రాత్రికే ఏపీకి రానున్నారు.
Chandrababu
Narendra Modi
Andhra Pradesh

More Telugu News