Raviteja: రవితేజ 75వ సినిమా ప్రారంభం .. రిలీజ్ చేసేది అప్పుడే!

Raviteja movie update

  • రవితేజ కథానాయకుడిగా 75వ సినిమా 
  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ 
  • కథానాయికగా సందడి చేయనున్న శ్రీలీల
  • దర్శకుడిగా భాను భోగవరపు పరిచయం


రవితేజ - శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన 'ధమాకా' ఒక రేంజ్ లో వసూళ్ల సందడి చేసింది. రవితేజ అభిమానులను హుషారెత్తించింది. మళ్లీ రవితేజ నుంచి అలాంటి సినిమా వస్తే బాగుంటుంది .. మళ్లీ రవితేజ - శ్రీలీల కలిసి కనిపిస్తే కనువిందుగా ఉంటుందని అంతా అనుకున్నారు. అలా అనుకున్నవారి ముచ్చట దాదాపు తీరిపోయినట్టే అనుకోవాలి. 

ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెగ్యులర్ షూటింగును కూడా మొదలెట్టేసింది. కెరియర్ పరంగా రవితేజకి ఇది 75వ సినిమా.  సితార నాగవంశీ - సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా భాను భోగవరపు పరిచయమవుతున్నాడు. 

మాస్ యాక్షన్ జోనర్లో ఈ సినిమా రూపొందనుంది. కంటెంట్ కి ఇచ్చిన కామెడీ టచ్ కూడా గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఇతర తారాగణం ఎంపిక ప్రక్రియ కూడా నడుస్తుందని చెబుతున్నారు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.  

  • Loading...

More Telugu News