G. Kishan Reddy: మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి: కిషన్ రెడ్డి

Kishan Reddy says there is no power cuts in India after modi
  • ఇప్పుడు విద్యుత్ కోతలు లేని దేశాన్ని చూస్తున్నామన్న కిషన్ రెడ్డి
  • దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గుది కీలక పాత్ర అని వెల్లడి
  • ముఖ్యమైన శాఖల్లో పాత మంత్రులే కొనసాగుతారన్న బీజేపీ నేత
నరేంద్రమోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవని... ఇప్పుడు విద్యుత్ కోతలు లేని దేశాన్ని చూస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమైన శాఖల్లో పాత మంత్రులే కొనసాగుతున్నట్లు చెప్పారు. 

తెలంగాణ నుంచి ఇద్దరికి కీలక పదవులు వచ్చాయన్నారు. తనకు బొగ్గు, గనుల శాఖను, బండి సంజయ్‌కి హోం సహాయమంత్రిత్వ శాఖని కేటాయించారని తెలిపారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గుది కీలక పాత్ర అన్నారు. నిన్న, రాష్ట్రపతి భవన్‌లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డికి... నేడు బొగ్గు, గనుల శాఖను కేటాయించారు.
G. Kishan Reddy
BJP
Narendra Modi

More Telugu News