Revanth Reddy: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy review in CCC
  • సీఎం వెంట మల్లు భట్టివిక్రమార్క, డీజీపీ రవిగుప్తా
  • పోలీసులు, ఇతర విభాగ అధికారులతో సమీక్ష
  • వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశా నిర్దేశనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, డీజీపీ రవిగుప్తా ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసులు, ఇతర విభాగ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశా నిర్దేశం చేశారు. సమీక్షలో విద్యుత్, పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. 
Revanth Reddy
Congress
Telangana

More Telugu News