తెలంగాణలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల
- భైరాన్ పల్లిలో గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గుర్తింపు
- శిలపై మహా వీరుడు ధ్యానం చేస్తున్న చిత్రాలు
- గతంలో కొలనుపాక, వేములవాడలో బయటపడ్డ ఇలాంటి శిలలు
పురావస్తు శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాజాగా బయటపడ్డ ఈ శిల జైన చౌముఖి శిల్పం అని, 5 అడుగుల ఎత్తుతో చెక్కారని చెప్పారు. నలువైపులా ఉన్న శిల్పాలు 24వ జైన తీర్థంకరుడు మహా వీరుడి ధ్యానం చేస్తున్న చిత్రాలని వివరించారు. గతంలో ఈ తరహా శిల్పాలను కొలనుపాక, వేములవాడలో గుర్తించామని చెప్పారు. జైనులు వీటిని ‘సర్వతోభద్ర’ అంటూ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ శిల్పాలు లభించిన ప్రాంతాలు గతంలో జైనధర్మ కేంద్రాలుగా విరాజిల్లాయని వివరించారు. బౌద్ధుల తరహాలోనే జైనులు కూడా స్తూపాలు, చైత్యాలు నిర్మించుకునేవారని, గ్రామంలోని అంగడి వీరన్న శివాలయం ముందున్న శాసనాల ద్వారా తెలుస్తోందని శ్రీనివాస్ చెప్పారు.