Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర కేబినెట్: మోదీ సహా ప్రమాణ స్వీకారం చేసిన 72 మంది వీరే...!

PM Narendra Modi Oath Taking Ceremony
Advertisement
  • కేబినెట్లో రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, నడ్డా, శివరాజ్ సింగ్, జైశంకర్, నిర్మల
  • కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన త్రిస్సూర్ నుంచి గెలిచిన సురేశ్ గోపి
  • మహిళా కోటాలో అన్నపూర్ణాదేవి, శోభాకరంద్లాజే, అనుప్రియా పటేల్‌లకు చోటు
Advertisement
నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీతో సహా 72 మంది ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. 

తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ, ఏపీ నుంచి ఒకరు బీజేపీ, ఇద్దరు టీడీపీ ఎంపీలకు కేబినెట్లో చోటు దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అనంతరం కొత్త మంత్రిమండలితో రాష్ట్రపతి గ్రూప్ ఫొటో దిగారు.

తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస వర్మలు హిందీలో ప్రమాణం చేశారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లు ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. త్రిస్సూర్ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి, జయంత్ చౌదరి, మురుగన్ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. మోదీతో సహా మెజార్టీ సభ్యులు హిందీలో ప్రమాణం చేశారు. తాజా క్యాబినెట్ లో మిత్ర పక్షాలకు 11 బెర్త్‌లను కేటాయించారు.

మంత్రులుగా ప్రమాణం చేసిన 72 మంది వీరే...

మొదట మోదీ ప్రమాణం చేశారు. ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్‌డీ కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), శరబానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, కింజారపు రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, మన్సుక్ మాండవీయ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, సీఆర్ పాటిల్, ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘావాల్, ప్రతాప్ రావ్ జాదవ్, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద్ నాయక్, పంకజ్ చౌదరి, కిషన్ పాల్, రాందాస్ అథవాలే, రామ్‌నాథ్ ఠాకూర్, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్, వి.సోమన్న, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ భగేల్, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బీఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేశ్ గోపి, డాక్టర్ ఎల్ మురుగన్, అజయ్ టంటా, బండి సంజయ్ కుమార్, కమలేశ్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి, సతీశ్ చంద్ర దుబే, సంజయ్ సేథ్, రవ్ నీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజందార్, సావిత్రీ ఠాకూర్, తోకన్ సాహు, రాజ్ భూషణ్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, హర్ష్ మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మొహోల్, జార్జ్ కురియన్, పబిత్ర మార్గరెటా ఉన్నారు.
Advertisement
Advertisement
Narendra Modi
Union Cabinet
G. Kishan Reddy
Bandi Sanjay

More Telugu News