G. Kishan Reddy: రెండోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి

Kishan Reddy takes oath as Union Minister
  • కిషన్ రెడ్డితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • హిందీలో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి
  • సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండోసారి విజయం
కిషన్ రెడ్డి రెండోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కిషన్ రెడ్డి హిందీలో కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. 

కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. మోదీ 2.0 కేబినెట్‌లో ఆయన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ కేబినెట్లో ఐదుగురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు, ఏపీ నుంచి ఒక బీజేపీ ఎంపీకి, టీడీపీ నుంచి ఇద్దరికి చోటు దక్కింది.
G. Kishan Reddy
BJP
Narendra Modi

More Telugu News