Congress: టీడీపీ, జేడీయూ మద్దతిస్తున్నాయి... బీజేపీ ఏకపక్ష ధోరణితో వెళ్లడం కుదరదు: మోదీపై పోటీ చేసిన కాంగ్రెస్ నేత అజయ్

Congress leader Ajay Rai says NDA government
  • గతంలో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న అజయ్ రాయ్
  • ఈసారి ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతోందని వెల్లడి
  • సంకీర్ణంలో ఏకపక్ష ధోరణితో వ్యవహరించలేదని వ్యాఖ్య
  • బీజేపీకి మద్దతిస్తున్న పార్టీల సిద్ధాంతాలు వేర్వేరుగా ఉంటాయన్న కాంగ్రెస్ నేత
టీడీపీ, జేడీయూ, ఇతర పార్టీలతో కలిసి ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతోందని... కాబట్టి నరేంద్రమోదీ ప్రభుత్వం ఈసారి ఏకపక్ష ధోరణితో వ్యవహరించలేదని కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ రాయ్ అన్నారు. ఆయన వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేసి 1.52 లక్షల మెజార్టీతో ఓడిపోయారు.

ఆదివారం అజయ్ రాయ్ మాట్లాడుతూ... గతంలో రెండుసార్లు బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిందని... కానీ ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతోందన్నారు. ఇంతకుముందు కేంద్రంలోని బీజేపీ వ్యవహరించిన తీరు వేరని... వారి ఆలోచనలు వేరని... ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు అవసరం కాబట్టి అలా వ్యవహరించడం సాధ్యపడదని అన్నారు. బీజేపీకి మద్దతిస్తున్న పార్టీలు భిన్నమైనవని... సిద్ధాంతాలు వేర్వేరుగా ఉంటాయన్నారు.
Congress
BJP
Narendra Modi

More Telugu News