మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
- రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో హాజరవుతున్న ఖర్గే
- ఇండియా కూటమి కీలక నేతలతో చర్చల అనంతరం నిర్ణయం
- కార్యక్రమానికి తృణమూల్ కాంగ్రెస్ గైర్హాజరు?
ఇండియా కూటమిలోని కీలక నేతలతో చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఖర్గే మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదని తెలుస్తోంది.