రామోజీరావు మృతి తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం: కేఏ పాల్

KA Paul condolence for Ramoji Rao death
షార్ట్స్‌లో చూడండి
రామోజీరావు మృతి తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రామోజీరావు మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. తాను తొలిసారి ఈటీవీ ద్వారానే శాంతి సందేశంతో ప్రజల ముందుకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. శాంతి సందేశాలు మతపరమైనవి కావని ఆయన భావించారని పేర్కొన్నారు.

రామోజీరావు మరణ వార్త విని చాలా బాధపడ్డానని తమిళ నటుడు కమల్ హాసన్ అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఓ అద్భుతమని కొనియాడారు. అది కేవలం షూటింగ్ లొకేషన్ మాత్రమే కాదని... ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా అన్నారు. అంత దూరదృష్టి, వినూత్న ఆలోచనాపరుడు రామోజీరావు అన్నారు. ఆయన మరణం భారత సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Go Back to Shorts
Ramoji Rao
KA Paul
Telangana
Andhra Pradesh

More Telugu News