భారత్‌లో కేజ్రీవాల్‌కు ప్రచారం కోసం బెయిల్ వచ్చింది... ఇక్కడ నేను అణచివేతకు గురవుతున్నాను: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- ఓ కేసులో పాక్ సుప్రీం కోర్టు ముందు హాజరైన ఇమ్రాన్ ఖాన్
- ఈ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్‌ను ప్రస్తావించిన పాక్ మాజీ ప్రధాని
- జైల్లో తాను అణచివేతకు గురవుతున్నానని ఆవేదన
- పాక్ ఎన్నికలకు తనను దూరం పెట్టేందుకు ఐదు రోజుల్లోనే దోషిగా తేల్చారని ఆవేదన
2022లో అధికారం కోల్పోయినప్పటి నుంచి తనకు ఎదురైన పరిస్థితులను ఆయన కోర్టుకు ఏకరవు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికలకు తనను దూరం పెట్టడానికి ఐదు రోజుల్లోనే తనను ఓ కేసులో దోషిగా తేల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ భారత్‌లో మాత్రం కేజ్రీవాల్ కు ప్రచారానికి బెయిల్ వచ్చిందన్నారు.