రాష్ట్రపతి ముర్మును కలిసిన నరేంద్ర మోదీ... ఎన్డీయే తీర్మానం అందజేత
- కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరిన మోదీ
- మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ముర్ము
- మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్న జేపీ నడ్డా, చంద్రబాబు తదితరులు
కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించిన నేపథ్యంలో, నరేంద్ర మోదీ ఈ నెల 9న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించేందుకు కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరుకానున్నారు.