Nara Lokesh: నరసింహ స్వామి ఆశీస్సులతో మంగళగిరిని నంబర్ 1గా నిలుపుతా: నారా లోకేశ్

I will make Mangalagiri number 1 constituency with the blessings of Narasimha Swamy says Nara Lokesh
  • మంగళగిరిలోని నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
  • భార్య నారా బ్రాహ్మణితో కలిసి వెళ్లిన లోకేశ్
  • ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన దంపతులు
నరసింహ స్వామి చల్లని ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ 1గా నిలబెడతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గురువారం ఆయన తన భార్య నారా బ్రాహ్మణితో కలిసి మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొన్నాయి.

కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌ మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. మంగళగిరిలో 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించారు. తన ప్రత్యర్థి మురుగుడు లావణ్యపై ఏకంగా 91,413 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నాటి నుంచి ఇప్పటివరకూ అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు.
Nara Lokesh
Telugudesam
AP Assembly Poll Results
Andhra Pradesh

More Telugu News