Revanth Reddy: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫోన్... విభజన అంశాలపై కీలక వ్యాఖ్యలు

Telangana CM Revanth Reddy Dials TDP Chief Chandrababu Naidu
  • ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి
  • రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్ష
  • విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి
  • చర్చించుకొని... సామరస్యంగా పరిష్కరించుకుందామని సూచన
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని టీడీపీ అధినేతను కోరారు. విభజన హామీలు, ఆస్తుల పంపకాలపై పూర్తిగా చర్చించుకొని... సామరస్యంగా పరిష్కరించుకుందామని సూచించారు.
Revanth Reddy
Congress
Chandrababu
Andhra Pradesh
Telangana
Telugudesam

More Telugu News