Revanth Reddy: తెలంగాణలో ప్రతి డిసెంబర్ 9న 'తెలంగాణ తల్లి' ఉత్సవాలు: రేవంత్ రెడ్డి

Telangana Thalli celebrations in Telangana every december 9
  • సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి
  • తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్న సీఎం
  • ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తామన్న రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇక ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న 'తెలంగాణ తల్లి' ఉత్సవాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు తమ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
Revanth Reddy
Congress
Sonia Gandhi
Telangana

More Telugu News