Ravindranath Reddy: చంద్ర‌బాబు ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేశారు.. జ‌గ‌న్ మేన‌మామ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Ravindranath Reddy Says Chandrababu Naidu Tampered EVMs
  • ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేసి చంద్ర‌బాబు గెలిచార‌న్న రవీంద్రనాథ్‌రెడ్డి
  • సింగ‌పూర్‌లో కూర్చొని టెక్నిక‌ల్‌గా ట్యాంప‌రింగ్ చేశారంటూ ఆరోప‌ణ‌
  • బార్‌కోడ్‌ల ద్వారా ఇలా చేశారంటూ వైసీపీ నేత‌ అనుమానం
ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేసి చంద్ర‌బాబు నాయుడు గెలిచార‌ని జ‌గ‌న్ మేన‌మామ‌, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సింగ‌పూర్‌లో కూర్చొని టెక్నిక‌ల్‌గా ట్యాంప‌రింగ్ చేశార‌ని తెలిపారు. బార్‌కోడ్‌ల ద్వారా ఇలా చేశారంటూ ఆయ‌న‌ అనుమానం వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌లో నే దీనిపై క్లారిటీ వ‌స్తుంద‌న్నారు. టీడీపీ అధినేత వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసి ఇదంతా న‌డిపించార‌ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జ‌రిగింద‌న్నారు. దీనిపై త్వ‌ర‌లోనే న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తామ‌ని ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి చెప్పారు.
Ravindranath Reddy
Chandrababu Naidu
EVM
Andhra Pradesh
YSRCP

More Telugu News