TDP-JanaSena-BJP Alliance: టీడీపీ కూటమి పెద్దలపై సినీ రంగం నుంచి విషెస్ వెల్లువ

Tollywood celebrities pours wishes on TDP alliance leaders
  • ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అసాధారణ విజయం
  • అభినందిస్తున్న సినీ ప్రముఖులు
  • తాజాగా, చంద్రబాబు, పవన్ లకు శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున
ఏపీలో అంచనాలకు మించి విజయం సాధించిన నేపథ్యంలో, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పెద్దలపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత నారా లోకేశ్ లను అభినందిస్తూ  సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

తాజాగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఎక్స్ లో స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి, ఏపీలో భారీ విజయాలు సాధించిన చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు అభినందనలు. మీపై దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా దార్శనిక నేత చంద్రబాబుకు శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలియజేశారు. రవితేజ, నాని కూడా చంద్రబాబు, పవన్ తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు.
TDP-JanaSena-BJP Alliance
Tollywood
Wishes
General Elections
Andhra Pradesh

More Telugu News