విశాఖ ఎంపీగా గెలుపొందిన శ్రీభరత్‌కు చంద్రబాబు, బాలయ్య అభినందన
- విశాఖ నుంచి ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందిన శ్రీభరత్
- వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ చిత్తు
- ఎన్నికల్లో పోటీచేసిన నందమూరి, నారా కుటుంబ సభ్యులు అందరూ గెలుపు
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన శ్రీభరత్‌ను చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ తదితరులు అభినందించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన నందమూరి, నారా కుటుంబ సభ్యులు అందరూ గెలవడం విశేషం. దీంతో అందరూ ఒక దగ్గరికి చేరుకుని సంబరాల్లో మునిగిపోయారు. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేశ్, హిందూపురంలో బాలకృష్ణ అసెంబ్లీకి ఎన్నికవగా, శ్రీభరత్ విశాఖ ఎంపీగా విజయం అందుకున్నారు.