VV Lakshminarayana: చంద్రబాబు కేంద్రాన్ని అడిగి ఇవన్నీ సాధించుకు రావాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

VV Lakshminarayana asks Chandrababu state demands should be resolved with centre
  • కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన ఎన్డీయే
  • ఏపీలో టీడీపీ కూటమి విజయభేరి
  • రాష్ట్ర డిమాండ్లు సాధించుకురావాలని చంద్రబాబును ఉద్దేశించి లక్ష్మీనారాయణ ట్వీట్
కేంద్రంలో ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి రాగా, చివరి నిమిషంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సుడిగాలి విజయం సాధించింది. కూటమి జోరులో వైసీపీ కొట్టుకుపోయింది. 

ఈ నేపథ్యంలో, భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. చంద్రబాబు కేంద్రాన్ని అడిగి  ఏపీకి అవసరమైనవన్నీ సాధించుకు రావాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య, విశాఖ రైల్వే జోన్, పెట్రోలియం బకాయిలు, అహ్మదాబాద్ కు సరిసమానంగా అమరావతికి కూడా ప్రోత్సాహకాలను రాబట్టేందుకు మంచి అవకాశం వచ్చిందని, చంద్రబాబు ఈ అంశాలను కేంద్రం వద్ద లేవనెత్తాలని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
VV Lakshminarayana
Chandrababu
Andhra Pradesh
NDA

More Telugu News