Veerabhadra Gowd: ఆలూరులో రీకౌంటింగ్ జరపాలన్న టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్

Alur TDP candidate Veerabhadra Gowd demands recounting
  • ఆలూరులో గందరగోళంగా మారిన ఓట్ల లెక్కింపు
  • 20 రౌండ్ల అనంతరం 2,962 ఓట్లతో వెనుకబడిన టీడీపీ అభ్యర్థి
  • అనుమానం ఉన్న 5 రౌండ్ల వీవీ ప్యాట్లను లెక్కిస్తున్న అధికారులు
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు గందరగోళంగా మారింది. రీకౌంటింగ్ జరపాలని టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం వీరభద్ర గౌడ్ కు 92,178 ఓట్లు రాగా... వైసీపీ అభ్యర్థి బి. విరూపాక్షి 2962 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. మరొక్క రౌండ్ లెక్కింపు మిగిలుంది. అయితే తనకు ఓట్లు తగ్గడంపై టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో... అనుమానం ఉన్న 5 రౌండ్ల వీవీ ప్యాట్లను అధికారులు లెక్కిస్తున్నారు. కాసేపట్లో ఆలూరు స్థానంలో ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Veerabhadra Gowd
Alur
Recounting
TDP
YSRCP

More Telugu News