Narendra Modi: ఏపీ ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారు: ప్రధాని మోదీ

PM Modi thanked AP people for exceptional mandate
  • ఏపీలో బ్రహ్మాండమైన విజయం సాధించిన ఎన్డీయే కూటమి
  • 160కి పైగా అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలతో జయకేతనం
  • ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ 
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అద్భుత ఫలితాలు సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎన్డీయే కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుగులేని విధంగా తీర్పును ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులను దీవించిన ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు. 

"ఈ మహత్తర విజయం నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, టీడీపీ, జనసేన, ఏపీ బీజేపీ కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి మేం కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో ఏపీ మరింత అభివృద్ధి చెందేలా పాటుపడతాం" అని ప్రధాని మోదీ వివరించారు.
Narendra Modi
Andhra Pradesh
Chandrababu
Pawan Kalyan
TDP-JanaSena-BJP Alliance

More Telugu News