Ram Gopal Varma: చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ కంగ్రాట్స్: రామ్ గోపాల్ వ‌ర్మ

Director Ram Gopal Varma Congrats to Chandrababu and Pawan Kalyan
  • ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై వర్మ స్పందన 
  • చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, లోకేశ్‌ల‌కు అభినంద‌న‌లు తెలుపుతూ ట్వీట్ 
  • అప్ప‌టివ‌ర‌కూ విమ‌ర్శ‌లు గుప్పించిన ఆర్‌జీవీ ఇలా మారిపోవ‌డంపై నెటిజ‌న్ల ఫైర్‌
ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూసి వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స్పందించారు. ఎన్నిక‌ల్లో గ్రాండ్ విక్ట‌రీ దిశ‌గా దూసుకెళ్తున్న కూట‌మిని ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా విజ‌యం సాధించిన జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుల‌కు అభినంద‌న‌లు తెలుపుతూ ప్ర‌త్యేకంగా ట్వీట్ చేశారు. కాగా, అప్ప‌టివ‌ర‌కూ విమ‌ర్శ‌లు గుప్పించిన ఆర్‌జీవీ ఇలా మారిపోవ‌డంపై నెటిజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక టీడీపీ, జ‌న‌సేన‌ల‌ను విమ‌ర్శిస్తూ గ‌తంలో రామ్ గోపాల్ వ‌ర్మ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అలాగే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, లోకేశ్‌ల‌ను పోలిన పాత్ర‌ల‌తో కొన్ని సినిమాలు కూడా తీశారాయ‌న‌.
Ram Gopal Varma
Chandrababu
Pawan Kalyan
Twitter

More Telugu News