Chandrababu: చంద్రబాబు గారూ... మీ పాలనలో ఏపీ దూసుకెళ్లాలి: తమిళనాడు సీఎం స్టాలిన్

Tamilnadu CM Stalin congratulates Chandrababu on TDP landslide victory in AP Assembly polls
  • ఏపీలో టీడీపీ ప్రభంజనం
  • సొంతంగా 136 స్థానాలు కైవసం చేసుకునే దిశగా టీడీపీ
  • చంద్రబాబుకు, టీడీపీకి శుభాకాంక్షలు తెలిపిన స్టాలిన్
ఏపీలో టీడీపీ, దాని మిత్రపక్షాలు అద్భుత విజయాలు నమోదు చేయడం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ విజయదుందుభి మోగించడం పట్ల శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మీ నాయకత్వంలో ఏపీ పురోగతి సాధించాలని, రాష్ట్రంలో శ్రేయస్సు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజల ఆశలను, వారి కలలను సాకారం చేస్తారని ఆకాంక్షిస్తున్నాను అంటూ సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సొంతంగా 136 స్థానాలు కైవసం చేసేందుకు పరుగులు తీస్తుండగా, జనసేన 21, బీజేపీ 8, వైసీపీ 10 స్థానాలు దక్కించుకునే అవకాశాలున్నాయి.
Chandrababu
MK Stalin
TDP
Andhra Pradesh
Tamil Nadu

More Telugu News