Allu Arjun: అల్లు అర్జున్ మ‌ద్ద‌తు తెలిపిన వైసీపీ అభ్య‌ర్థి ఓట‌మి

Allu Arjun Support YSRCP Candidate Defeat
  • నంద్యాల‌లో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డి ప‌రాజ‌యం
  • ర‌విచంద్ర‌పై టీడీపీ అభ్య‌ర్థి మ‌హ్మ‌ద్ ఫ‌రూక్ విజ‌యం
  • గ‌తంలో వైసీపీ అభ్య‌ర్థి త‌ర‌ఫున బ‌న్నీ ప్ర‌చారం
నంద్యాల‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ‌ద్ద‌తు తెలిపిన వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డి ఓట‌మి చ‌విచూశారు. ర‌విచంద్ర‌పై టీడీపీ అభ్య‌ర్థి మ‌హ్మ‌ద్ ఫ‌రూక్ ప‌ద‌కొండు వేల‌కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘ‌న విజ‌యం సాధించారు. 

కాగా, నంద్యాల‌లో వైసీపీ అభ్య‌ర్థి త‌ర‌ఫున బ‌న్నీ ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. దీన్ని చాలామంది జ‌న‌సైనికులు త‌ప్పుబ‌ట్టారు. కుటుంబానికి చెందిన‌ జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తివ్వాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌రోవైపు అల్లు అర్జున్‌, ర‌విచంద్ర‌పై అనుమ‌తి లేకుండా జ‌నాల‌ను పోగు చేశారంటూ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
Allu Arjun
YSRCP
Nandyala
Andhra Pradesh

More Telugu News