Chandrababu: చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యుల సంబరాలు అదుర్స్... ఫొటోలు ఇవిగో!

Chandrababu family members celebrates in grand style after TDP landslide victory
  • ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీ విజయం
  • ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వెల్లువెత్తిన సంతోషం
  • కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్న నారా, నందమూరి కుటుంబీకులు
  • కేక్ కోసి అందరికీ తినిపించిన నారా దేవాన్ష్
ఏపీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు కేరింతలు కొడుతూ ఫలితాలను ఆస్వాదించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు  తెలుపుకున్నారు. ముఖ్యంగా నారా లోకేశ్ తల్లి భువనేశ్వరిని హత్తుకుని ఆనందం వెలిబుచ్చారు. చిన్నారి దేవాన్ష్ కేక్ కోసి అందరికీ తినిపించాడు. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.  
.
Chandrababu
Family
Celebrations
TDP
TDP-JanaSena-BJP Alliance
YSRCP
Andhra Pradesh

More Telugu News