Hanuma Vihari: ప‌వ‌న్‌, చంద్ర‌బాబుకు కంగ్రాట్స్: హ‌నుమ విహారి

Hanuma Vihari Congratulates Pawan Kalyan and Chandrababu Naidu
  • ప‌వ‌న్ పదేళ్ల ప‌ట్టుద‌ల‌, ప్ర‌ణాళిక ఇప్పుడు అధికారం తెచ్చి పెడుతోంద‌న్న క్రికెట‌ర్‌
  • విజ‌యం దిశ‌గా సాగుతున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్, లోకేశ్‌కు అభినంద‌న‌లు
  • వైసీపీని ఉద్దేశిస్తూ 'క‌ర్మ ఎప్పుడూ విఫ‌లం కాదు' అంటూ ట్వీట్  
ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ కూట‌మి భారీ విజ‌యం దిశ‌గా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ అనంతరం టీడీపీ సొంతంగా 131 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే.. జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. అటు అధికార వైసీపీ 17 చోట్ల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. దీంతో కూట‌మి భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం దాదాపు ఖాయ‌మైంది. ఈ నేప‌థ్యంలో భార‌త క్రికెట‌ర్ హ‌నుమ విహారి కూట‌మిని ఉద్దేశిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. 

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ది సంవ‌త్స‌రాల ప‌ట్టుద‌ల‌, ప్ర‌ణాళిక ఇప్పుడు అధికారం తెచ్చి పెడుతోంద‌ని అన్నారు. ఘ‌న విజ‌యం దిశ‌గా సాగుతున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నారా లోకేశ్‌కు అభినంద‌న‌లు అని ఆయ‌న ట్వీట్ చేశారు. అలాగే వైసీపీని ఉద్దేశిస్తూ 'క‌ర్మ ఎప్పుడూ విఫ‌లం కాదు' అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.
Hanuma Vihari
Team India
Pawan Kalyan
Chandrababu Naidu
Andhra Pradesh

More Telugu News