Gorantla Butchaiah Chowdary: టీడీపీ ఖాతాలో తొలి విజయం... రాజమండ్రి రూరల్ లో మంత్రిని ఓడించిన బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdary confirms his victory in Rajahmundry rural
  • రాజమండ్రి రూరల్ లో ఓట్ల లెక్కింపు పూర్తి
  • టీడీపీ అభ్యర్థి గోరంట్ల 64,090 ఓట్ల భారీ మెజారిటీ
  • మంత్రి చెల్లుబోయినకు ఘోర పరాజయం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో తొలి విజయం చేరింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తిరుగులేని ఆధిక్యంతో నెగ్గారు. 

రాజమండ్రి అసెంబ్లీ స్థానంలో మొత్తం 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,090 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఘోర పరాజయం చవిచూశారు. గోరంట్ల బుచ్చయ్య విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించింది.

గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మొత్తం 1,29,060 ఓట్లు రాగా, మంత్రి చెల్లుబోయినకు 64,970 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాజమండ్రి రూరల్ లో టీడీపీ విజయం సాధించడంతో స్థానిక పార్టీ  శ్రేణులు  సంబరాలు చేసుకుంటున్నాయి.
Gorantla Butchaiah Chowdary
TDP
Rajahmundry
Chelluboyina
YSRCP

More Telugu News