Andhra Pradesh Election Results 2024: ఏపీలో టీడీపీ కూట‌మి సునామీ.. 150 ప్లస్..!

TDP Alliance Leading in Andhra Pradesh Election Results 2024
  • ఇప్పటికే టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి 154 స్థానాల్లో ఆధిక్యం
  • జ‌న‌సేన పోటీ చేసిన 21 స్థానాల‌కు గాను 19 చోట్ల లీడింగ్‌
  • వైసీపీ నుంచి మంత్రులంతా వెనుకంజ
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. కూట‌మి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జ‌న‌సేన పోటీ చేసిన 21 స్థానాల‌కు గాను 19 చోట్ల లీడింగ్‌లో ఉంది. వైసీపీ 20కి పైగా చోట్ల‌ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. వైసీపీ నుంచి మంత్రులంతా వెనుకంజలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఒక్క సీఎం జగన్ మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. 

డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, న‌గ‌రిలో రోజా, గుడివాడలో కొడాలి నాని, చెల్లుబోయిన వేణు, మంత్రి అంబటి రాంబాబు, మంత్రి అమర్ నాథ్, జోగి రమేశ్, బొత్స సత్యనారాయణ, వనిత ఇలా మంత్రులంద‌రూ వెనుకంజలోనే ఉన్నారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా వెనుక‌బ‌డ్డారు. ఈసారి కూట‌మి సునామీ సృష్టించింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఇదే జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి కార్యకర్తలు బాణాసంచా కాల్చి గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు.
Andhra Pradesh Election Results 2024
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
Janasena

More Telugu News