Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు 20 వేల ఓట్ల ఆధిక్యం

Pawan Kalyan leads with 20000 votes
  • పిఠాపురంలో ప్రస్తుతం 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో జ‌న‌సేనాని
  • జ‌న‌సేన పోటీ చేసిన 21 స్థానాల‌కు గాను 19 చోట్ల ఆధిక్యం
  • కాకినాడ‌, మ‌చిలీప‌ట్నం ఎంపీ స్థానా‌ల్లోనూ జ‌న‌సేన ముందంజ‌
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. పిఠాపురంలో ప్రస్తుతం 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2019లో ఒకే సీటు గెలిచిన జ‌న‌సేన ఈసారి సునామీ సృష్టిస్తోంది. పోటీ చేసిన 21 స్థానాల‌కు గాను 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. కోస్తాతో పాటు రాయ‌ల‌సీమ జిల్లాల్లోనూ గ్లాస్ గుర్తు దూసుకెళ్తోంది. అటు కాకినాడ‌, మ‌చిలీప‌ట్నం ఎంపీ స్థానా‌ల్లోనూ జ‌న‌సేన అభ్య‌ర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News