Macherla: మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి 1000 ఓట్ల అధిక్యం... 90 చోట్ల టీడీపీ లీడింగ్

Macherla TDP Candidate Julakanti Brahmareddy get 1000 votes lead against Pinnelli
  • ఏపీలో నేడు కౌంటింగ్
  • కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
  • మాచర్లలో పిన్నెల్లి వెనుకంజ
  • 1000 ఓట్లతో బ్రహ్మారెడ్డికి ఆధిక్యం
ఏపీలో ఓట్ల లెక్కింపు వేళ అందరి దృష్టి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంపై ఉంది. ఇక్కడ అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి పోటీ చేశారు. పోలింగ్ రోజున పిన్నెల్లి ఈవీఎం బద్దలు కొట్టడం, పల్నాడు ఎస్పీని ఈసీ మార్చడం వంటి పరిణామాలతో మాచర్లపై ఫోకస్ పెరిగింది. 

ఇవాళ కౌంటింగ్ ప్రారంభం కాగా... టీడీప అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి 1000 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు. అటు, గురజాలలోనూ టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు లీడింగ్ లో ఉన్నారు. ఓవరాల్ గా టీడీపీ 90, వైసీపీ 13, జనసేన 11, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Macherla
Julakanti Brahmareddy
Pinnelli Ramakrishna Reddy
TDP
YSRCP

More Telugu News