Chandrababu: ఏపీలో కౌంటింగ్ షురూ... కుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం

Chandrababu gets into lead in Kuppam
  • ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు కౌంటింగ్
  • రెండు చోట్ల ఆధిక్యంలో టీడీపీ
  • ఇంకా రేసులోకి రాని వైసీపీ, ఇతర పార్టీలు
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు, రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకు 910 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తమ్మీద ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ కూటమి రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ, ఇతర పార్టీలు ఇంకా రేసులోకి రావాల్సి ఉంది.
Chandrababu
Kuppam
Counting
TDP
Andhra Pradesh

More Telugu News