T20 World Cup: టీ20 వరల్డ్ కప్: కేశవ్ మహారాజ్ డబుల్ ధమాకా... కష్టాల్లో శ్రీలంక

Sri Lanka lost four early wickets against SA in T20 World Cup
  • న్యూయార్క్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • 32 పరుగులకే 4 వికెట్లు డౌన్
టీ20 వరల్డ్ కప్ లో నేడు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. న్యూయార్క్ లోని నాసావ్ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. 

అయితే, 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక కేవలం 3 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన కమిందు మెండిస్ రెండో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 

ఇక, కెప్టెన్ వనిందు హసరంగ (0) డకౌట్ కావడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. హసరంగను అవుట్ చేసిన సఫారీ లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఆ తర్వాతి బంతికే సదీర సమరవిక్రమ (0)ను బౌల్డ్ చేయడంతో శ్రీలంక నాలుగో వికెట్ చేజార్చుకుంది. 

ప్రస్తుతం శ్రీలంక స్కోరు 9 ఓవర్లలో 4 వికెట్లకు 36 పరుగులు. ఓపెనర్ కుశాల్ మెండిస్ (16 బ్యాటింగ్), చరిత్ అసలంక (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఓట్నీల్ బార్ట్ మాన్ 1, కేశవ్ మహారాజ్ 2, ఆన్రిచ్ నోర్కియా 1 వికెట్ తీశారు.
T20 World Cup
Sri Lanka
South Africa
New York
USA

More Telugu News