Papua New Guinea: ఫర్వాలేదు... వెస్టిండీస్ పై ఓ మోస్తరు స్కోరు చేసిన పసికూన పాపువా న్యూ గినియా

Papua New Guinea scores 136 runs for 8 wickets against West Indies
  • టీ20 వరల్డ్ కప్ లో నేడు వెస్టిండీస్ × పాపువా న్యూ గినియా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసిన పాపువా న్యూ గినియా
ఓవైపు రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ విజేత వెస్టిండీస్... మరోవైపు పసికూన పాపువా న్యూ గినియా! ఇవాళ టీ20 వరల్డ్ కప్ లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాపువా న్యూ గినియా ఫర్వాలేదనిపించేలా ఓ మోస్తరు స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసింది. 

పాపువా న్యూ గినియా ఇన్నింగ్స్ లో సెసె బావు అర్ధసెంచరీతో మెరిశాడు. బావు 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 50 పరుగులు చేశాడు. కెప్టెన్ అసద్ వాలా 21, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కిప్లిన్ డోరిగా 27 పరుగులు చేశారు. చార్లెస్ అమిని 12, చాద్ సోపర్ 10 పరుగులు చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా లీగ్ లు ఆడుతూ రాటుదేలి, టీ20 క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న విండీస్ బౌలర్లను ఎదుర్కొని పాపువా న్యూ గినియా ఆ మాత్రం స్కోరు చేయడం గొప్పే. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, ఆండ్రీ రసెల్ 2, అకీల్ హోసీన్ 1, రొమారియో షెపర్డ్ 1, గుడాకేశ్ మోతీ 1 వికెట్ తీశారు.
Papua New Guinea
West Indies
Batting
Guyana
T20 World Cup

More Telugu News