Alleti Maheshwar Reddy: తెలంగాణ చిహ్నంలో చార్మినార్‌ను తొలగించే ధైర్యం ఉందా?: బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి

Maheshwar Reddy demand removal of charminara in emblem
  • రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడి
  • రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండాల్సిందేనని స్పష్టీకరణ
  • బలిదేవతకు రేవంత్‌ రెడ్డి భక్తుడిగా మారిపోయారని ఎద్దేవా
  • బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుంచుకోవాలన్న మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ చిహ్నంలో చార్మినార్‌ను తొలగించే దమ్ము, ధైర్యం ఉన్నాయా? అని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం పాలకుల చిహ్నాలు, ఆనవాళ్లను తొలగిస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు రూ.25 వేలు ఇస్తామని చెప్పారని... ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు. బలిదేవతకు రేవంత్‌ రెడ్డి భక్తుడిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలకు బీజేపీ నేతలను పిలిస్తే బాగుండేదన్నారు.
Alleti Maheshwar Reddy
Revanth Reddy
Telangana

More Telugu News