Shubman Gill: శుభ్‌మ‌న్ గిల్‌ పెళ్లి రూమర్ల‌పై క్లారిటీ

Ridhima Pandit talks about her marriage rumours with Shubman Gill
  • టీవీ న‌టి రిధిమా పండిట్‌తో గిల్ పెళ్లంటూ రూమ‌ర్స్‌
  • ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ జంట పెళ్లి పీట‌లెక్క‌నుంద‌ని పుకార్లు
  • అలాంటిదేమీ లేదంటూ రిధిమా క్లారిటీ
టీమిండియా యువ‌ క్రికెటర్ శుభ్‌మ‌న్ గిల్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడంటూ సోషల్ మీడియాలో పలు వార్త‌లు హల్చల్ చేశాయి. బాలీవుడ్ సీరియల్ నటి రిధిమా పండిట్‌ను గిల్ పెళ్లి చేసుకోనున్నాడంటూ నెట్టింట రూమ‌ర్స్ చ‌క్క‌ర్లు కొట్టాయి. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ జంట పెళ్లి పీట‌లెక్క‌నుంద‌ని పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమర్ల‌పై నటి రిధిమా స్పందించారు.

"నేను ఉదయానే లేచి చూడగానే నాకు జర్నలిస్టుల నుంచి పలు ఫోన్ కాల్స్ వచ్చాయి. వాళ్లందరూ నా పెళ్లి గురించే అడిగారు. నేను పెళ్లి చేసుకోవట్లేదు. ఒకవేళ నా లైఫ్‌లో అలాంటి ముఖ్యమైనది ఏదైనా జరిగితే నేను కచ్చితంగా అనౌన్స్ చేస్తాను. ఈ రూమ‌ర్స్‌లో ఎటువంటి నిజం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చేశారు.

ఇక రిధిమా పండిట్ న‌టన విష‌యానికి వ‌స్తే.. టీవీ న‌టి అయిన రిధిమా 'బహు హుమారీ రజనీ కాంత్ ఫేమ్' అనే సీరియ‌ల్‌తో బాగా పాప్యుల‌ర్‌ అయ్యారు. అలాగే 'ఖత్రోన్ కే ఖిలాడి 9', 'హైవాన్', 'ఫియ‌ర్ ఫ్యాక్ట‌ర్‌' వంటి టెలివిజ‌న్ షోల‌లో కూడా ఆమె క‌నిపించారు.
Shubman Gill
Ridhima Pandit
Marriage
Rumours
Team India

More Telugu News