Narendra Modi: కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం

PM Modi completes 45 hour long meditation at Kanyakumari
  • కన్యాకుమారిలో మగిసిన 45 గంటల ధ్యానం
  • రెండు రోజుల క్రితం ఏకాంత ధ్యానముద్రలోకి మోదీ
  • వివేకానంద రాక్ మెమోరియల్‌లో మెడిటేషన్
కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానం ముగిసింది. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం ముగియడంతో మోదీ ఏకాంత ధ్యానముద్రలోకి వెళ్లారు. వివేకానంద రాక్ మెమోరియల్‌లో ఆయన మెడిటేషన్ పూర్తి చేశారు. వివేకానంద మండపం బయట, లోపల ధ్యానం చేశారు. కొబ్బరి నీల్లు, ద్రాక్షరసం లాంటి ద్రవపదార్థాలే తీసుకున్నారు. చేతిలో జపమాల ధరించి మోదీ మండపం చుట్టూ నడిచారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన మోదీ... తమిళనాడులోని భగవతి అమ్మాన్ ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించారు.  అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలోని శిలా స్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. తొలుత సూర్యోదయం సమయంలో సూర్య ఆర్ఘ్యం సమర్పించిన తర్వాత ధ్యానం ప్రారంభించారు.
Narendra Modi
Tamil Nadu
BJP

More Telugu News