Tirumala: ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ గెల‌వాల‌ని కోరుతూ.. మోకాళ్ల‌పై తిరుప‌తి మెట్లెక్కిన యువ‌తి!

Young woman who climbed the steps of Tirumala on her knees for Pawan Kalyan
  • తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన‌ ప‌సుపులేటి దుర్గా రామ‌లక్ష్మి సాహ‌సం
  • సుమారు 450 మెట్లు మోకాళ్ల‌పై ఎక్కిన‌ట్లు వెల్ల‌డి
  • జ‌న‌సేనానిపై అభిమానంతోనే ఇలా మోకాళ్ల‌పై మెట్లు ఎక్కిన‌ట్లు వ్యాఖ్య‌
మ‌రో మూడు రోజుల్లో ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యం సాధించాల‌ని కోరుతూ తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఓ యువ‌తి మోకాళ్ల‌పై తిరుమ‌ల మెట్లు ఎక్కారు. ఉండ్రాజ‌వ‌రానికి చెందిన ఆర్ఎంపీ వైద్యురాలు ప‌సుపులేటి దుర్గా రామ‌లక్ష్మికి ప‌వ‌న్ అంటే ఎన‌లేని అభిమానం. ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని గెల‌వాల‌ని ఆమె తిరుమ‌ల శ్రీవారిని మెక్కుకున్నారు. 

అందులో భాగంగా మే 25న సుమారు 450 మెట్లు మోకాళ్ల‌పై ఎక్కిన‌ట్లు రామ‌లక్ష్మి మీడియాతో తెలిపారు. పార్టీల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని, కేవ‌లం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఉన్న అభిమానంతోనే ఇలా మోకాళ్ల‌పై మెట్లు ఎక్కిన‌ట్లు ఆమె చెప్పారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయ‌న భారీ మెజారిటీతో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ఈ సంద‌ర్భంగా దీమా వ్య‌క్తం చేశారు.
Tirumala
TTD
Andhra Pradesh
Pawan Kalyan
Janasena

More Telugu News