Chandrababu: విజయవాడలో డయేరియా మరణాల‌పై చంద్రబాబు ఆవేద‌న‌

TDP President Nara Chandrababu Naidu Talks about Diarrhoeal Deaths in Vijayawada
  • విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది మృతి
  • బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై చంద్ర‌బాబు ఆందోళన
  • ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టిపెట్టాలన్న టీడీపీ అధినేత‌
విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 

డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు వెంట‌నే స్పందించాలని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత ప్రభుత్వాన్ని కోరారు.
Chandrababu
Diarrhoeal
Vijayawada
Andhra Pradesh

More Telugu News